Tuesday, 28 July 2026 01:24:41 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని.

Date : 07 June 2026 07:25 PM Views : 259

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి. కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం. గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. కార్మికుల శ్రమతో సింగరేణి సంస్థ మనుగుడా సాగిస్తోందని. ఆ యాజమాన్యం సంస్థ కు మూలాధారమైన కార్మికులను చిన్న చూపు చూస్తోందని. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న యాజమాన్యం ఇకనైనా మానుకోవాలని మానుకోవాలని, కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాలు చేయక తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆదివారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే విధానాలను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్లర్క్ పోస్టుల భర్తీ, డిస్మిస్ అయిన కార్మికులకు ప్రత్యేక అవకాశం కల్పించడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గత నెల గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన కార్మికులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని విమర్శించారు. పెర్క్స్‌పై ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలని, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నాయకులు కోరారు. సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు యూనియన్ నాయకుడు కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, సెంట్రల్ సెక్రటరీలు వంగ వెంకట్, వీరస్వామి, వివిధ ఏరియాల బ్రాంచ్ కార్యదర్శులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :