తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం 9వ మైలు తండాకు చెందిన గుగులోతు పీక్లా (46) ఆగస్టు 19న ఇంటికి వెళ్తుండగా, కొత్తగూడెం నుండి ఇల్లందు వెళుతున్న ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ