Tuesday, 28 July 2026 04:45:22 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే.

Date : 21 June 2026 06:55 PM Views : 206

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.100 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి నవీకరణతోనే పారిశ్రామిక వృద్ధి సాధ్యం.పరిశ్రమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకం ఇది వ్యూహాత్మక అనుసంధానం. బొగ్గు రవాణా, భద్రాచలం పుణ్యక్షేత్రానికి మెరుగైన సౌకర్యం.తూర్పు, మధ్య తెలంగాణ ఆర్థిక పురోగతికి జాతీయ రహదారి ఎంతో కీలకం.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే.కొత్తగూడెం నుండి తల్లాడ మీదుగా జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో రోడ్డు రవాణా, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ జైరాం గడ్కరిని, రాష్ట్ర రాజధానిలో రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఆయన లేఖలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుమారు వంద కిలోమీటర్ల పొడవు కలిగి, కొత్తగూడెం (ఎన్ హెచ్-30) - వైరా - జగ్గయ్యపేట (ఎన్ హెచ్-65) లను అనుసంధానించే ఈ రహదారి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ మరియు గిరిజన ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర రహదారి అని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బిటిపిఎస్, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉండటం వల్ల ఇది ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉందన్నారు. ఈ రోడ్డు పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలను కలపడమే కాకుండా, అంతర్జాతీయ పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకోవడానికి భక్తుల మార్గాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. దీనిని జాతీయ రహదారిగా మార్చడం వల్ల తూర్పు, మధ్య తెలంగాణ మధ్య రవాణా మెరుగై, బొగ్గు రవాణా సులభతరమవుతుందని, గ్రామీణ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. జగ్గయ్యపేట వద్ద ఎన్ హెచ్-65 కి అనుసంధానం కావడం ద్వారా ప్రధాన మార్కెట్లకు లింక్ ఏర్పడుతుందని, ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ నవీకరణ పనులను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను అయన సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :