తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని జనసేన పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యులు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా పార్టీ కార్యక్రమాలు చేపడ తామన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ముగ్గురు మంత్రులు ప్రాతి నిథ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలో అభివృద్ధి పనులు సాగడం లేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా కేవలం శంకుస్థాపనలతో కాలం వెల్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమ ర్శించారు. ఆగస్టు 2న దమ్మపేటలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాము, రామకృష్ణ, సాదిక్, దివ్య, సౌజన్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ