Tuesday, 28 July 2026 08:13:20 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్‌ఐ జీనత్ కుమార్.

Date : 24 June 2026 05:14 PM Views : 109

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ మరియు సీఐ ఆధ్వర్యంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు, దుకాణదారులు మాత్రమే కాకుండా సంబంధిత కంపెనీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. దుకాణాలలో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చేయడంతో పాటు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు–అమ్మకాల బిల్లులు తనిఖీ సమయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలు మరియు దుకాణంలో ఉన్న స్టాక్ మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. విత్తనాలను ఎంఆర్పీ ధరలకు మించి విక్రయించరాదని, రైతులు కొనుగోలు చేసిన ప్రతి విత్తనానికి సంబంధించి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. రైతులు కోరిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, గ్రామాల్లో తిరుగుతూ అనధికారికంగా విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో పటిష్ట నిఘా కొనసాగుతోందని, అనుమానం ఉన్న సందర్భాల్లో డీలర్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :