Tuesday, 28 July 2026 04:41:39 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం ఏరియాను అభివృద్ధి పథంలో నడిపించిన షాలెంరాజును ఘనంగా సత్కరించిన ఏరియా స్టోర్స్ అధికారులు, ఉద్యోగులు.

Date : 28 July 2026 03:39 PM Views : 39

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవీవిరమణ సందర్భంగా జిఎం సేవలను కొనియాడిన అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు ఈ నెల 31న పదవీవిరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం ఉదయం ఏరియా స్టోర్స్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని షాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత షాలెంరాజుదేనని కొనియాడారు. బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన అందించిన సేవలు విశిష్టమైనవని పేర్కొన్నారు.రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, రుద్రంపూర్ జయశంకర్ మైదానాన్ని ఆధునిక స్టేడియం తరహాలో అభివృద్ధి చేయడం, ప్రగతి వనం పార్కును కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కొత్తగూడెం ఏరియాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వంతో జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం యువ అధికారులకు ఆదర్శప్రాయమని వక్తలు పేర్కొన్నారు.పదవీవిరమణ అనంతరం కూడా షాలెంరాజు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, ఆయన అందించిన సేవలు సింగరేణి అధికారులకు, ఉద్యోగులకు చిరస్మరణీయంగా నిలుస్తాయని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం గోవిందరావు, ఏరియా ఇంజనీర్ విత్తనాల రామకృష్ణ, వీకే కోల్ మైన్ పీవో ఎం. నరసింహారావు, ఏరియా స్టోర్స్ హెచ్‌వోడీ మైనేని శ్రీనివాసరావు, స్టార్ ఇంజనీర్ భాస్కర వెంకట రమణ, మేనేజర్ మురళి, సేఫ్టీ ఆఫీసర్ అనిల్, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఎఐటీయూసీ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ (కమల్), ఐఎన్‌టీయూసీ పిట్ కార్యదర్శి నటరాజ్, నాయకులు సాంబమూర్తి, అవినాష్, నరేందర్, నాగేశ్వరరావు, నరేష్, సురేష్, సాగర్, గావిని నాగరాజు, లకవత్ వెంకటేశ్వర్లు, రాజేష్, సుబ్రమణ్యం, మెయిన్, లికిత్, గంగాధర్, సామల నరేందర్, ఉద్యోగులు, డీఎల్‌ఆర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :