తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు జూలై 26 27 తేదీలలో అశ్వరావు పేటలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి జిల్లా వ్యాప్తంగా 23 మండలాల నుండి 700 మంది సిపిఐ పార్టీ ప్రతినిధులు హాజరై రెండు రోజులు మహాసభలను విజయవంతం చేయడం జరిగింది, సుమారు పది సంవత్సరాల నుండి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లో పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ, గత కొన్ని రోజుల క్రితం ఏఐవైఎఫ్ జూలూరుపాడు లో జరిగిన మహాసభలో జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికై, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యమాలు చేస్తూ నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని మణుగూరులో జరిగిన గత 2వ మహాసభలలో సిపిజి జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికై సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుందని పోరాటాలు చేస్తూ, అతి చిన్న వయసులోనే కొత్తగూడెం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి, అశ్వరావుపేటలో జరిగిన సిపిఐ మూడవ మహాసభలలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడుగా ఎన్నుకోవడం జరిగింది, ఫహీమ్ దాదా స్పందిస్తూ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని నేటి యువతరం రాజకీయాల వైపు రావాలని సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా యువతకు చైతన్యం కలిగిస్తానని, సిపిఐ పార్టీతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు అదేవిధంగా నాపై నమ్మకం విశ్వాసంతో జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ