తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు.జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు – భూసమస్యల పరిష్కారం కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు – భూసమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రజావాణి నిర్వహిస్తారు. ఇతర సమస్యల పై దరఖాస్తు చేసుకునేవారు కలెక్టరేట్లోని ఇన్వార్డ్ నందు తమ దరఖాస్తులను అందజేసి రసీదు పొందగలరని దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ