Tuesday, 28 July 2026 05:09:53 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పరిశ్రమల స్థాపన తోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది... జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 25 June 2025 08:10 PM Views : 783

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవుత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మతో కలిసి టీజీ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావే శాన్ని సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని, దీంతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అని అన్నారు. వారికి అన్ని రకాల అర్హతలు ఉంటే త్వరితగతిన స్థాపనకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా టీజీ ఐపాస్, టీప్రైడ్, పీఎం ఈజిపి, పీఎం ఎఫ్ఎంఈ, ముద్ర రుణాలు వంటి పథకాలు మరియు డిఆర్డిఏ ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పరిశ్రమలు స్థాపించాలన్నారు. టీజీ ఐపాస్ కింద పరిశ్రమలకు కావలసిన వివిధ రకాల అనుమతులు మంజూరు, పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి సురక్ష బీమా వయోజన మరియు జీవనజ్యోతి బీమా యోజన పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి ఇటుకల తయారీ తో షెడ్యూల్ నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ మరియు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వారికి ఏ రంగంలో శిక్షణ అవసరము తెలుసుకొని ఆ రంగంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో బయోచార్, ఏబిసిడి డ్రైవ్ లు పై అవగాహన కల్పించాలన్నారు. ఐ టి ఐ లు, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు నవ లిమిటెడ్ వారు సమన్వయంతో ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి ఇటుకలతో వర్క్ షెడ్లు నిర్మించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ వారు జిల్లాలోని ఐటిఐ విద్యను చదువుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. స్కిల్ సెంటర్ ల ద్వారా జిల్లా వ్యాప్తంగా యువతకు వ్యవసాయ రంగ పరిశ్రమల పై శిక్షణా తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డి. ఈ. ఈ. టి ) ఈ యాప్ లో నమోదు అవ్వడం ద్వారా విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను అర్హత ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వివరాలు తెలుస్తాయని, నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ ఉపాధి కోర్సులను చదివిన విద్యార్థులు డి ఈ ఈ టి లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. విద్యార్థులందరూ దీనిలో నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు . ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తిరుపతయ్య, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖ అధికారి అనసూయ, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖ ఏడి రమేష్, మైనింగ్ ఏడి దినేష్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :