Tuesday, 28 July 2026 01:22:13 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెంలో ఫ్రెషర్స్ వేడుకలు ---ముఖ్య అతిథి గా హాజరైన ఫార్మసీ డీన్ ఆచార్య గాదె సమ్మయ్య కాకతీయ యూనివర్సిటీ.

Date : 11 January 2025 08:37 PM Views : 545

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ వేడుకలలో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆచార్య గాదే సమ్మయ్య మాట్లాడుతూ ఈ వేడుక ఫార్మసి వృత్తిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థిని విద్యార్థుల కోసం వారి నైతిక బాధ్యతలను గుర్తు చేస్తూ. సేవా మానవత్వంతో ముందుకు కొనసాగాడానికి ప్రేరణను ఇచ్చే ప్ర త్యేక కార్యక్రమం అని చెప్పారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలి అని అన్నారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు సైంటిఫిక్ మెథడాలజీని అలవర్చుకొని కొత్త ఔషధంలు కనుగొనే విధంగా తయారు కావాలని, ప్రపంచ దేశాలు ఆంటీ వైరల్, ఆంటీ బ్యాక్టీరియల్, మరియు ఆంటీ క్యాన్సర్, డయాబెటిక్, అల్జిమర్స్, డెమిన్షియ వంటి కొత్త మందుల తయారు కొరకు అన్వేషణలు ఉంది అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఫార్మసీ కోర్సు వృత్తి విద్యా కోర్సు 50 శాతం థియరీ 50% ప్రాక్టికల్ చదవాల్సి ఉంటుంది కనుక విద్యార్థులు శ్రద్ధతో ప్రాక్టికల్స్ చేస్తూ థియరీలో మంచి పట్టు సాధించి సైంటిఫిక్ విధానాన్ని అలవరచుకొని క్రొత్త మందులను కనుక్కోవడానికి విద్యార్థులు కృషి చెయ్యాలని సైంటిఫిక్ మెథడాలజీని పాటిస్తూ చదవాలని మానసిక ఒత్తిడికి గురి కావద్దని మరి ప్రతి విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్ టుడే బుక్ ను తప్పకుండా చదివి అందులో పొందుపరిచిన సమాచారాన్ని రోజు వారీగా ప్రజలకు సేవ రూపంలో అందించాలని, ఫార్మసీ విద్య ఆత్మస్థైర్యాన్ని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ను, జీవితం మీద నమ్మకాన్ని సమాజంలో నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని కనుక ప్రతి ఒక్కరూ చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు.

మనం మొదటిగా అందరం ఫార్మసిస్టులం కనుక ప్రతి ఫార్మసిస్టులకు మందుల మీద పూర్తిపట్టు ఉంటుందని, ఫార్మసిస్ట్ మందులకు జీవం పోస్తారు మందులు రోగులకు జీవం పోస్తాయి, ఫార్మసిస్టు మరియు రోగులకు పరోక్ష సంబంధం ఉంటుందని, ఫార్మసిస్ట్ రోగుల పట్ల ప్రథమ డాక్టర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కానీ మీరు ప్రజలకు మందుల వాడక విషయం లో ఫార్మసిస్టు మరియు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడవద్దు అని సూచించాలని, 90% భారతదేశ ప్రజలు ఫార్మసిస్టు సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు దీనికి ముఖ్య కారణం ఫార్మసిస్టు విధులు తెలియకపోవడం అని, ఈ విధులను తెలియజేయడమే మీ యొక్క ముఖ్య బాధ్యత అని కొనియాడారు. భారతదేశ ప్రజలకు ఫార్మసిస్టు సేవలు ముఖ్యమని, ఫార్మసిస్టు సర్వీసులు అవసరమని మరియు ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ఫర్మకోవిగిలన్స్, క్లినికల్ శాస్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్, రెగ్యులేటరీ అఫైర్స్ ,ఫార్మసిస్టు గా అనలిస్ట్ గా డ్రగ్ ఇంస్పెక్టర్ గా ఫార్మాఇండస్ట్రీ లలో ఉజ్యల భవిష్యత్తు ఉందని తెలిపారు. మరియు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తారని వారి సేవలు వెన్నుపూస వంటిదని తెలిపారు, మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సెల్ ఫోన్ అలవాటుకు స్వస్తి చెప్పి, పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా మోహన్ గారు మాట్లాడుతూ మెడికల్ రంగంలో పూర్తి నాలెడ్జిని అందిస్తామని, పూర్తిగా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు క్లినికల్ గా తయారు చేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి గారు మాట్లాడుతూమాట్లాడుతూ సమాజంలో ఫార్మసి విలువ మరియు బాధ్యతలను విద్యార్థులకు వివరించారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఈ కళాశాలలో ఫార్మసీ విద్యను అభ్యసించడం గొప్ప విషయం అన్నారు, ఈ సందర్భంగా డీన్ ఆచార్య సమ్మయ్య మరియు డాక్టర్ రాధా మోహన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిరంజీవి ఫార్మసీ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :