తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నాచౌక్ లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి కొత్తగూడెం నుండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆధ్వర్యంలో భారీ వాహన శ్రేణితో విజయవాడ బయలుదేరారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలలో 12 మెడికల్ కళాశాలలను పి.పి.పి పద్ధతిన ప్రైవేటుపరం చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ అనుబంధ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దశలవారీగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని,భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేస్తున్నారని,బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాలలోని పేదలకు కూడా నష్టం వాటిల్లే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని,దీన్ని మేధావులు విద్యావంతులు యువకులు విద్యార్థులు కూటమి ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను ఎండగట్టాలని కోరారు కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కొరకు తీసుకొచ్చిన జీ.ఓ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెబీపీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,వినయ్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మిట్ట నరసింహారావు,పోలే కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ