తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులు విద్యతో పాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్,జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రగతి మైదానంలో జరిగిన సబ్ జూనియర్స్ బాలురు, బాలికల బాక్సింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్స్ పోటీలను 15 విభాగాల్లో ఈ నెల 25,26,27వ తేదీల్లో పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయ సబ్ జూనియర్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ జట్టును ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర విభాగం నుండి ఆర్.గణేష్, ఆర్.ఉదయ్, ఎస్.కె.అసిమ్ ఆలీ, జెస్విత్, వి.సాయి కిరణ్, కె.అరుణ్ కృష్ణ, డి.హేమంత్, కె.మధు,కె.సోహిత్ చంద్ర, బాలికల విభాగంలో ఏ.ప్రవళిక, ఎం.హనిత్య శ్రీ, లోక్షిత, కె.శరణ్య, డి.సుప్రియ, కె.అమృత వర్షిణి, బి.కీర్తన లను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ షమీ ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివసుబ్రమణ్యం, కోచ్ జి.ఈశ్వర్, సహాయ కోచ్ బానోతు సాగర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ