తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 20 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లబండబోడు గ్రామంలో నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ప్రెస్ క్లబ్ సీనియర్స్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్ ను మరియు కమిటీ సభ్యులను అభినందించారు ఆపై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామమైన నలబండబోడు గ్రామం గత పది సంవత్సరాల నుండి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి పిటి కేసులు లేకుండా ఉత్తమమైన గ్రామంగా ఉందని గ్రామ ప్రజలను అభినందించారు. గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మంచిగా చదివించాలని కొంత మేరకు చదువులు చదివించిన ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు మేరకు దగ్గరలో ఉన్న పట్టణాలకు పంపించడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మిగతా వారంతా చదువుకోవాలని ఆసక్తి పెరిగిద్దని సూచించారు. అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామం కనుక విషపురుగుల నుండి జాగ్రత్తగా ఉండాలని, వర్షాకాలం మొదలైనందున వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ వైద్య శిబిరం నకు ఎంతో బిజీగా ఉన్నా పేద ప్రజల కోసం వచ్చినటువంటి డాక్టర్ బాబురావు, డాక్టర్ రాజశేఖర్ అయ్యప్ప, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి వారిని మరియు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కాకర్ల రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర లను అభినందించారు. ఇక ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా చూయించుకున్న వారు ఈ ఒక్క నెల మందులను వాడి వదిలేయకుండా డాక్టర్లను కలుస్తూ అవసరమున్న మేరకు క్రమం తప్పకుండా ఔషధాలను వాడాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్బిసిఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ దయానంద్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ