Tuesday, 28 July 2026 04:53:26 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 16 March 2026 07:29 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా అమలుకావాలంటే అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో భూమి కేటాయింపు, భూమి అవసరాల అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల పరిధిలో అమలులో ఉన్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా మంజూరైన పనుల వివరాలు, వాటి ప్రస్తుత పురోగతి, ఎప్పుడు మంజూరు అయ్యాయి, ఇప్పటివరకు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఏ పథకం కింద పనులకు మంజూరు లభించింది, పనుల అమలుకు ఎంత భూమి అవసరం ఉంది, భూమి కేటాయింపులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అటవీ భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా వంటి అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు భూమి సమస్యల కారణంగా ఆలస్యం కాకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన భూమి గుర్తింపు, కేటాయింపు ప్రక్రియలను వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభం కావడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భూమి కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలను పూర్తి వివరాలతో సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అన్ని శాఖలు తమ శాఖల పరిధిలో అమలులో ఉన్న పనులపై సమగ్ర సమాచారం సేకరించి, మంజూరైన పనులు, వాటి పురోగతి, భూమి అవసరాలు, పెండింగ్‌కు కారణాలు వంటి అంశాలను వివరంగా పొందుపరుస్తూ నివేదికలను సిద్ధం చేసి జిల్లా పరిపాలనకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు .ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, బీసీ సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీలత, నీటిపారుదల శాఖ ఈఈ అర్జున్ రావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లందు, అశ్వరావుపేట, మణుగూరు మున్సిపల్ కమిషనర్ లు జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, విద్యుత్, వ్యవసాయ, అటవీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :