Tuesday, 28 July 2026 03:17:59 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 19 May 2026 08:16 PM Views : 171

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, హమాలీ, రవాణా తదితర ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు . జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 3,76,288 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 2,19,729.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,56,558.5 క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వ ఉన్నట్లు తెలిపారు . మంగళవారం ఒక్కరోజులోనే 10,091.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు తెలిపారు. రవాణా కోసం 458 లారీలు, 131 ట్రాక్టర్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అదనంగా మరో 1,50,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.యెల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, జూలూరుపాడు, గుండాల, అల్లపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను త్వరితగతిన గోదాములకు తరలిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని అన్నారు . రైతుల ఖాతాల్లో చెల్లింపులు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆ ప్రకటనలో తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :