తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిసెంబర్ 23 సింగరేణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మంగా నిర్వహించే వేడుకను, నామమాత్రంగా నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం ఏరియా లో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి,సింగరేణి ఆవిర్భావా దినోత్సవాన్ని బహిష్కరించిన గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి,సింగరేణి డే వేడుకల పట్ల ఆర్థిక ఆంక్షలు విధిస్తూ నిధులు కుదించి, వేడుకలు ఘనంగా నిర్వహించకుండా జీ ఏం ఆఫీస్ వరకే పరిమితం చేయడం పట్ల ఆగ్రహించరు, కార్మికులను,కార్మిక కుటుంబాలను అవుమానపరిచిన సింగరేణి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు,136 సంవత్సరాల చరిత్రకలిగాన సింగరేణినీ పరిమిత స్థాయిలో వేడుకలు గతంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించ గా, ఈసారి పరిమిత స్థాయిలో జరపడం. నిధులను సైతం భారీగా తగ్గించడం, జీఎం కార్యా లయాల్లోనే వేడుకలు నిర్వహించడంపై కార్మిక కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, గతం నుంచి వస్తున్న సంప్రదాయాలకు విలువ తగ్గిందని,కార్మికుల కార్మిక కుటుంబాలను అవమానించడంపై గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి మండిపడ్డారు.కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, గుమ్మడి వీరయ్య,నాయకులు, రాజపూడి సంబమూర్తి,మధుకృష్ణ ఏం ఆర్ కే ప్రసాద్,కమల్, మెంగెన్ రవి, సురేందర్,మురళి,వినయ్, లిఖిత్,అవినాష్,రాజేందర్రాజేష్,నాగరాజు,భుక్య రమేష్,సాయిపవన్,అప్పారావు,ఆకుల శ్రీనివాస్, జడల ప్రకాశ్, రాంచందర్,తాతిదారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ