Tuesday, 28 July 2026 11:04:20 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సీతారామ కెనాల్ పెండింగ్ భూసేకరణ వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 21 May 2025 09:08 PM Views : 555

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతారామ ఎత్తిపోతుల పథకం కెనాల్ భూ సేకరణ పై ఇరిగేషన్ మరియు సర్వే అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లోగా గ్రామసభలు నిర్వహణ పూర్తి చేయాలన్నారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందని అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్ అధికారులు సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేయర్లకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, లాప్టాప్ లు అందజేస్తామన్నారు. భూ సర్వే లో ఆధునిక పద్ధతులను అవలంబించి వేగవంతంగా భూ సర్వే పూర్తి చేయాలన్నారు. భూ సర్వే లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడిక తీయు విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు పొలాల్లో ఉపయోగించుకునేందుకు మట్టిని తీసుకు వెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. చెరువులన్నిటిలో పూడిక తీయడం ద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు. అధికారులందరూ దీనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అన్ని చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. చెరువులు మరియు కాలువల వెంట సుబాబులు, తంగేడు తాటి చెట్లను విస్తృతంగా నాటే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వల వెంట పిల్ల కాలువల నిర్మాణం మరియు పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అవసరమైన సాండ్ బ్యాగులు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈలు అర్జున్ రావు, సురేష్ కుమార్ అశ్వరావుపేట, ఇల్లందు ఈఈ చారి, మరియు డి ఈ లు,సర్వేయర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :