తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఈ యాప్ ద్వారా తాము సాగు చేస్తున్న పంటల్లో ఎలాంటి సమస్యలు అయినా అంటే భౌతిక మరియు జీవ సంబంధ వత్తిడిలను శాటిలైట్ ద్వారా ముందస్తు హెచ్చరికలు రూపంలో ఇస్తారు. తదనుగుణంగా రైతులు పంటలో వున్న సమస్యలను గుర్తించి, సమస్య ఎక్కడ ఉందొ ఆ చోట తగు చర్యలు తీసుకొని పంటను కాపాడుకోవచ్చు.ఈ యాప్ గురించి జిల్లా కలెక్టర్ జీతేష్ పాటిల్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు, జిల్లా ఉద్యాన అధికారి కిషోర్ లకు గూగుల్ మీట్ ద్వారా కృషి వాస్ ప్రతినిధిలు శ్రీకాంత్, ఆదర్శ్ విషదీకరించారు. ప్రధాన ప్రారంభ కార్యక్రమం 2025 నవంబర్ లో వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభిస్తారు.ఆధునిక డిజిటల్ యుగంలో కృషివాస్ యాప్ వాడకంపై అవగాహన కల్పించడానికి ఒక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని దమ్మపేటలో నిర్వహించడం జరిగింది. కృషివాస్ యాప్ యొక్క లక్ష్యం రైతులకు మొబైల్ ద్వారా హెచ్చరికలు, నావిగేషన్ మొదలైన వాటిలో జియోట్యాగింగ్/యాప్ ఇన్‌స్టాలేషన్‌పై శిక్షణ ఇవ్వడం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం మరియు దమ్మపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు.ఈరోజు జరిగిన గూగుల్ మీట్ లో అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు రవి కుమార్, దమ్మపేట మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎచ్ ఇ ఓ ఈశ్వర్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ