తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతానగర్ : సుజాతనగర్ ప్రాంతంలోని వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టాక్టర్లను ఎస్సై జుబేదా బేగం పట్టుకున్నారు. గత వారం క్రితం 84 కేజీల నిషేధిత గంజాయిని చాకచక్కంగా పట్టుకొని పై అధికారులతో శభాష్ అనిపించుకున్నారు, నిషేధిత గంజాయి, ఇసుక, నిషేధిత గుట్కా, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు, ఒక ప్రకటనలో ఎస్సై జుబేదా మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇసుక మాఫియా చేస్తున్న అక్రమార్కులకు హెచ్చరించారు అదేవిధంగా ప్రభుత్వం నిషేధిత మత్తు ద్రవాలను ఎవరైనా రవాణా చేసిన అమ్మిన, చట్ట వ్యతిరేక పనులు చేసిన సహించేది లేదని,ఎవరైనా ఇటువంటి లు పనులు చేస్తున్నారని మీరు చూసిన మీ దృష్టికి వచ్చిన మాకు సమాచారం ఇవ్వాలని సుజాతనగర్ మండల ప్రజలకు ఎస్ఐ జుబేద కోరారు...
Admin
తెలుగు వెలుగు టీవీ