తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతులు పొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 30.05.2026 న బదిలీ మీద వచ్చిన ఇద్దరు పోలీసు అధికారులు ఈరోజుతో వారి యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. పోలీసు శాఖలో ఎన్నో ఎళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి పదవి విరమణ పొందుతున్న అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖకు తమ సేవలను అందించి పదోన్నతి పొంది బదిలీ మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన అధికారుల వివరాలు సబ్ ఇన్స్పెక్టర్ కొదిరిపాక సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ జెడల సాధయ్య ఇరువురు తమ సేవలను 38 సంవత్సరాలు పోలీసు శాఖకు అందించారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ