తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సందర్శించి అక్కటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహిమ్ దాదా మాట్లాడుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ లను ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యల నిలయంగా మారుతున్న వైద్యశాఖ మంత్రి పర్యవేక్షణ వైఫల్యం చెందిందని, తెలుస్తుందని ఆయన అన్నారు ఆస్పత్రులలో సరిపడ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది లేక, సరైన సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, కొన్ని ఆస్పత్రులలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మందులు కూడా లేకపోవడం ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు వస్తే వారి పరిస్థితి ఏంటిదని వారు ప్రశ్నించారు జిల్లా ఆసుపత్రి అయిన మాతా శిశు ఆసుపత్రిలో 20 నుండి 25 మంది డాక్టర్లు అవసరం ఉంటే 5 మంది డాక్టర్లతో జిల్లా ప్రసూతి హాస్పిటల్ ఉండడం సిగ్గుచేటని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యం శాఖ మంత్రి సందర్శించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు, తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాలో కొరత ఉన్న డాక్టర్లను,నర్సులను,ల్యాబ్, టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్రితం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యూం, ఉపాధ్యక్షులు, పరిగెల భూపేష్, మోతే కృష్ణ, జిల్లా నాయకులు రణధీర్, జావిద్, రవి, బానోత్ శ్రీను, వెంకట్, వినయ్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ