తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ