తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పలు కేసులు వివరాలను,వాటి పురోగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.కొత్త కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు.ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి "క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్" ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు అనునిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు.గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గుట్కా,మట్కా,జూదం,బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు.రౌడీషీటర్లు మరియు పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ నివారణాచర్యలు చేపట్టాలని సూచించారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.మహిళలు,చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.అధికారులందరూ తమ క్రింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు వ్యక్తిగత జీవితంలో మరియు ఉద్యోగ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.అనంతరం ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫింగర్ ప్రింట్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన చంద్రుగొండ ఎస్సై స్వప్నను అభినందించారు. ఈ సమావేశంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు మరియు సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ