తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 5 (తెలుగు వెలుగు ) మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం నుంచి కరివారిగూడెం గ్రామం వరకు సుమారు కిలోమీటరు పైన ఉన్న తారు రోడ్డు పూర్తిగా గుంటలమయమైంది. ఏడాదికాలంగా ఈ తారు రోడ్డు ధ్వంసమైనా. ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తారు రోడ్డు మరింత దారుణంగా మారింది. పాపకొల్లు, బేతాళపాడు, చింతలతండా ప్రాంతాల నుంచి కొత్తగూడెం, సుజాతనగర్ వెళ్లేందుకు వందలాదిమంది ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. తారు రోడ్డు పూర్తిగా దెబ్బ తినటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణం సాగించటం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి కొమ్ముగూడెం నుంచి కరివారిగూడెం వరకు తారు రోడ్డు మరమ్మతులు జరిపించాలని మరియు. మండల పరిధిలో సూరారం రోడ్డు మార్గం వీరభద్రపురం దగ్గరలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాలువపై బ్రిడ్జి వద్ద ఉన్న విరువైపులా రహదారి ఈ నాలుగు రోజులు కురుస్తున్న వర్షానికి కోతకు గురై వాహనదారులకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తక్షణమే ఈ రహదారిని కోతకు గురైన రోడ్డును మరమ్మతులు చేపట్టాలని ఆ య గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ