తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2025 - 26 విద్యా సంవత్సరమునకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలకు జూన్ మొదటి వారంలోనే ప్రభుత్వ పుస్తకాలు అందేలా కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు గాను నేడు ఎం ఆర్ సి కార్యాలయంలో కాంప్లెక్స్ తో హెచ్ఎం, రిసోర్స్ పర్సన్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అలానే జూన్ 3న నిర్వహించబడనున్న పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా నిమిత్తం స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ