Tuesday, 28 July 2026 08:12:55 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాచలం వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 30 September 2025 01:42 PM Views : 360

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ, ఈ రోజు ఉదయం 3:30 గంటలకు 48.00 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు. ప్రస్తుతం నదీ ప్రవాహం ద్వారా 11,82,547 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతూ, 48.80 అడుగులుగా ఉన్నదని కలెక్టర్ తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుందని పేర్కొన్న కలెక్టర్, ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రజల కోసం తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు సులభంగా సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు క్రింది నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు: సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం – 08743-232444 వరదల కంట్రోల్ రూమ్ – 7981219425 జిల్లా కలెక్టర్ కార్యాలయం, పాల్వంచ – 08744-241950 ఐటీడీఏ కార్యాలయం, భద్రాచలం – 7995268352 ప్రజలందరూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కలెక్టర్ కోరారు. జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :