తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని క్యాబినెట్ బెర్తుల దాకా అడుగడుగునా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయమే చేశారు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి మహిళా కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం లో ధ్వజమెత్తారు కెసిఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు కవితకు 10 సంవత్సరాలు మహిళలు గుర్తురాలే. తెలంగాణ ప్రజలు గుర్తు రాలే తెలంగాణలో ప్రజల యొక్క కష్టాలు సమస్యలు గుర్తురాలే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కరు గింజుకుంటున్నారు దేనికి అంట. 10 సంవత్సరాల లో మీ జాలి హృదయం ఎక్కడికి పోయింది
మీరు ఇచ్చిన మాటలు ఎక్కడికిపోయినాయ్. మహిళలకు తెలంగాణ వచ్చిన తర్వాత మీరే కదా రాజ్యమేలుండ్రు..... మహిళ ఆదరణ లభించకపాయే మహిళా పథకాలు సంక్షేమం విస్మరించిండ్రు కనీసము మీ క్యాబినెట్లో మహిళలకు స్థానము ప్రతిపక్షముగా మేము కాంగ్రెస్ వాళ్ళం పోరాడితేనే ఇచ్చారు మీరు మర్చిపోయారేమో కానీ. కాంగ్రెస్ పార్టీ అట్ల కాదు 2023 డిసెంబర్ 7న గద్దెక్కిన కాంగ్రెస్ స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంది ఆడబిడ్డల మొహాల్లో నవ్వులు చూస్తా వున్నారు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు పెద్దపిట్ట వేసింది సీతక్క సురేఖ అక్క లాంటి వాళ్లకు క్యాబినెట్లో అవకాశం దక్కింది కార్పొరేషన్ లో మరింత మంది మహిళలను తీసుకోవడం జరిగింది బీసీ కమిషన్ గా మహిళా సభ్యులను చేర్చుకోవడం జరిగింది మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మహిళలను ఓనర్లుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్కే దక్కింది మహిళలను వ్యాపారవేత్తలుగా పరిశ్రమకవేత్తలుగా తీర్చిదిద్దుతూ వడ్డీ లేని రుణాలను అందిస్తున్నది 200 యూనిట్ కరెంటు తో పాటు సన్న బియ్యాన్ని 500 సబ్సిడీ గ్యాస్ ను అందిస్తున్నది ఇవేవీ పాపం బి ఆర్ఎస్ కళ్ళకు కనిపియ్యట్లే వాళ్లకు పచ్చకామెర్లు వచ్చినాయి. కాబట్టి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి చోట లీడర్లు బడా లీడర్లు....చెప్పినవి చెప్పనివి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ అప్పులలో కూరుకుపోయిన ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయిస్తూ..మహిళా క్యాంటీన్లతో పాటు చెప్పినవి చెప్పనివి అన్నిటిని కూడా అందిస్తూ మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో మహిళా సోదరీమణులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే మహారాణులుగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కాయం. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కొల్లు పద్మ , మహిళా కాంగ్రెస్ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ బోడ దివ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కళ్యాణి, హైమా, రమాదేవి, శారద, పద్మ, విద్య, అరుణ, శ్రీలక్ష్మి భవాని, విజయలక్ష్మి, పద్మ, శ్రీలత రెడ్డి, సుశీల, రాజేశ్వరి,రజనీ,వార్డు మెంబర్ మాజీ సర్పంచులు మహిళా కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ