తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులపై అలసటత్వం వహిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏ టి డబ్ల్యూఓ సమాచార అధికారిని కలిసి హెచ్ఎం మరియు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలo లో చీపురుగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు పెద్దపీట వేసి ఉన్నత విద్యను అందించే క్రమంలో విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏజెన్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతుందని , చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు గిరిజన మరియు పేద విద్యార్థులని అలాంటి విద్యార్థులను మోసం చేస్తూ హెచ్ఎం మరియు వార్డెన్ సొమ్ము చేసుకోవడం బాధాకరమని, ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుకునే దానికోసం ఆశ్రమ పాఠశాలకు వస్తే వాళ్లని అడ్డాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం అని పాఠశాలలో ఉండే విద్యార్థులకు వాళ్లు వేసుకునే హాజరు సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేకుండా జిసిసి నుండి వస్తున్న అన్ని రకాల పప్పు ఉప్పు మంచి నూనె మొదలగు వాటిని అమ్ముకుంటూ గిరిజన విద్యార్థుల కడుపు కొడుతు హెచ్ఎం వార్డెన్ల లావాదేవీల మీద విద్యార్థులకు అందవలసిన గుడ్డు అరటిపండు స్నాక్స్ మొదలగు వాటిని కూడా పెట్టకుండా విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఐటిఐ పిఓ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షణ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గుండాల సుజన్ జిల్లా సమితి సభ్యులు రాజ్ కమల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ