Tuesday, 28 July 2026 03:18:40 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలి -*జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ....

Date : 28 August 2024 08:03 PM Views : 850

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు... బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీడీవోలు,తహసీల్దార్లతో శాఖల వారీగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను సకాలంలో సిద్ధం చేయాలని, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో పని జరుగుతుందని అన్నారు.జాబితా తయారీలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. వారంలో రెండుసార్లు తప్పకుండా శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. డెంగ్యూ, చికెన్ గునియా,వైరల్ ఫీవర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాలలో తక్కువ ఖర్చుతో ప్రత్యేక ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన మండలాలు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 31 వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి కోనోకార్పస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో పగోడా తదితర మొక్కలను నాటించాలని అధికారులకు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, వాటి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని చెప్పారు. జిల్లాలో మందుల కొరత ఉన్నదని తన దృష్టికి వచ్చిందని దీని విషయంలో అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, డిపిఓ చంద్రమౌళి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :