Tuesday, 28 July 2026 09:58:54 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 01 June 2025 06:02 PM Views : 372

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారుతున్నారని,అలా కాకుండా సాంస్కృతిక పోటీల్లో,క్రీడల్లో రాణించినప్పుడే వారు మానసిక ఉల్లాసంగా ఉంటారని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.కొత్తగూడెం పట్టణంలోని పద్మశాలి భవన్ లో రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సూపర్ డాన్స్ సీజన్ -2 పోటీలకు ముఖ్య అతిథిగా కామేష్ హాజరై డాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం పుస్తకాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు.ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న కళలను బయటకు తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అలా కాకుండా ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి,వారికి తగిన శిక్షణను ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు.డాన్స్ పోటీలకు విచ్చేసిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు.ఎలాంటి బెరుకు లేకుండా చిన్నారులు అద్భుతంగా తమ నృత్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.కొత్తగూడెం కళాకారులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.సూపర్ డ్యాన్సర్ 1వ సిరీస్ వల్లే 2వ సిరీస్ పోటీలు చాలా చక్కగా నిర్వహించిన డాన్స్ మాస్టర్స్ కనకం ప్రవీణ్ కుమార్,సందెబోయిన సంపత్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. న్యాయనిర్ణేతలుగా రచ్చ మధు,కడారి వెంకట్,భద్రాచలం శ్యామ్ లు వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ఎన్&ఆర్ ఫామ్ ల్యాండ్ అధినేత రామక్రిష్ణ,జేబీపీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,కొప్పుల యశ్వంత్,మాజీ కౌన్సిలర్ రుక్మెందర్ బండారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :