తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 16 (తెలుగు వెలుగు ) : గత ఎనిమిది నెలల క్రితం జూలూరుపాడు మండలపరిధిలోని చింతలతండా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న బానోత్ తరుణ్ విధులలో భాగంగా విద్యుత్ లైన్ లకు తలుగుతున్న చెట్ల కొమ్మలను తీసివేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించాడు. అయితే మరణించిన తరుణ్ సతీమణి అనూషకు బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో పరిహారంగా ఆ శాఖ ADE రవికుమార్ 4.50.000వేల రూపాయల విలువ గల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ AE నరసింహారావు, ప్రవీణ్, చింతలతండా మాజీ సర్పంచ్ రాములు, సుబ్బారావు, వీరన్న పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ