Tuesday, 28 July 2026 06:49:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలోని ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి

Date : 09 May 2025 06:22 PM Views : 583

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణ నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు,కంపెనీల భద్రతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశ్రమల భద్రతాధికారులతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో పరిశ్రమల యాజమాన్యాలు మరియు భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం,సారపాక ఐటిసీ, KTPS,BTPS మరియు NAVA లిమిటెడ్ కంపెనీల భద్రతాధికారులు మరియు సంబంధిత పోలీసు అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలలో ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ దానికనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.అలారం సిస్టమ్ విధానాన్ని తమ కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు.తమ ప్రాంతాల్లోని ప్రతి ప్రదేశంలో సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పరిశ్రమల,కంపెనీల ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అదేవిధంగా దొంగతనాలు జరగకుండా తమ వంతు నిఘా ఏర్పాటు చేసుకుని పోలీస్ వారికి సహకరించాలని కోరారు.తమ తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.నిషేదిత మావోయిస్టుల కార్యకలాపాల పట్ల కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని పరిశ్రమలు,కంపెనీల వద్ద గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు.అత్యవసర సమయంలో ప్రజలు పాటించాల్సిన విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో భారజల కేంద్రం కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐలు వెంకటేశ్వర్లు,అశోక్ రెడ్డి,ఐటిసీ సెక్యూరిటీ ఆఫీసర్ మనీష్ శర్మ,KTPS అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్,BTPS అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :