తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సుజాతనగర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది.కేసు వివరాలు:ఈ ఏడాది ఏప్రిల్ 29 రాత్రి సుజాతనగర్ సబ్-ఇన్స్పెక్టర్ ఎం. రమాదేవి ఆధ్వర్యంలో నాయకులగూడెం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ములకలపల్లి కి చెందిన రవ్వా వినోద్ అనే వ్యక్తి మద్యం సేవించి ట్రాక్టర్ నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా అతని శరీరంలో 210 MG/100 ML ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది.మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185 కింద పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సుజాతనగర్ ఎస్ఐ M. రమాదేవి హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ