తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన హక్కుల రక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు. పాల్వంచలో 18, 19 తేదీల్లో టిజిఎస్ రాష్ట్ర మహాసభలు. ఏర్పాట్లను వేగవంతం చేసి మహాసభలు జయప్రదం చేయాలి. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర మహాసభలు.గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చలు. తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్.గిరిజన హక్కుల రక్షణ కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాజీలేని పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సమాఖ్య మూడవ రాష్ట్ర మహాసభల ప్రచార కరపత్రాలను శనివారం స్థానిక శేషగిరి భవన్‌లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, సవాళ్లు మరియు వారు సాగిస్తున్న పోరాటాలు తదితర కీలక అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. గిరిజన సమాజం అంతా ఏకమై ఈ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను వేగవంతం చేయాలని, మహాసభలను విజయవంతం చేయడానికి శ్రేణులంతా కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్, నాయకులు జర్పుల ఉపేందర్, బానోతు వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ