తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ శేషగిరి భవన్ నందు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, సురవరం సుధాకర్ రెడ్డి(83)కి ఘనంగా నివాళులర్పించిన సిపిఐ అనుబంధ యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె ఖయ్యూం,జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురవరం 1942 మార్చి 25 న మహబూబ్నగర్ జిల్లా గండవపల్లి గ్రామం నందు జన్మించడం జరిగిందని విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విభజన ఉద్యమ నేతగా సిపిఐ లో ముఖ్య నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుండి 2004 వరకు రెండుసార్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ చేయడం జరిగిందని. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా రెండుసార్లు పార్టీకి సేవలు అందించారన్నారు. 2012 నుండి 2018 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు, జావిద్, రసూల్, రణధీర్, కృష్ణ, నాయకులు బబ్లు,రవి, నరేష్, శివ, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ