Monday, 27 July 2026 01:00:21 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు

Date : 27 December 2024 05:54 PM Views : 848

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 27 (తెలుగు వెలుగు) ; మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఐ ఏ ఎల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐ ఏ ఎల్) నేడు ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన సరళి కృత ఆర్థిక విధానాలు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహనీయుడని ఈ సందర్భంగా వారు కొనియాడారు .ఆర్థిక సంస్కరణతో పాటు అనేక చట్టాలను తీసుకొచ్చిన మహనీయుడు .2005లో గృహం చట్టం ,సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, 2006లో అటవీ హక్కుల చట్టం ,2007లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ,2008లో అసంఘటిత కార్మిక భద్రత చట్టం ,2009లో పిల్లల ఉచిత విద్య ,నిర్బంధ విద్య ఇలా అనేక చట్టాలను తెచ్చి సమాజ హితం కోసం పనిచేసిన మహా నాయకుడు వారు కొనియాడారు. పనిచేయటమే తప్ప ఎలాంటి అంగు ,ఆర్భాటం, ప్రచారం కోరుకొని ప్రధానిగా ఇవాళ ఇంతటి గుర్తింపు పొందారని అన్నారు .ఆయన చేసిన చట్టాలను బ్రష్టు పట్టించకుండా వాటిని అమలు పరచడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భావిస్తుంది. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :