తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని హమాలీకాలనీ ఇళ్ల మధ్యలోకి పది అడుగుల కొండచిలువ శనివారం రాత్రి వచ్చింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే పావురాల సంగయ్యకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని, మైలారం అటవీ ప్రాంతంలో వదిలి వదిలిపెట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ