తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీల్లో ఒకటి అయినటువంటి గృహ జ్యోతి పథకం ద్వారా అర్హులైన వారందరకు ఉచిత విద్యుత్ని అందించాలని. ఇంకా మండలంలో ఈ పథకం అమలు కాని నిరుపేదలు చాలామంది ఉన్నారని సత్వరగా ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకంలో భాగస్వాములను చేయాలని జూలూరుపాడు మండల ఏఈ ఎస్ సతీష్ కు వినతి పత్రాన్ని అందజేసిన భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు తంబర్ల నరసింహారావు, మాల మహానాడు మండల అధ్యక్షుడు బడుగు వీరస్వామి మరియు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ జెర్రిపోతుల నరేష్ కుమార్, బుక్య నరసింహారావు, బాబూలాల్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ