Tuesday, 28 July 2026 04:17:51 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత.

Date : 19 May 2026 11:12 AM Views : 313

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం కుప్పగా పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. ఈ ఘటన చండ్రుగొండ మండలం దామెరచర్లలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగపాడు సొసైటీ పరిధిలోని దామెరచర్ల గ్రామానికి చెందిన రైతులు కొనుగోలు కేంద్రానికి నెల రోజుల క్రితం ధాన్యం విక్రయానికి తరలించారు. అయితే ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు, మిల్లర్లు నిబంధనలు, లారీల కొరత అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రైతుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కానీ, మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకుండా సోమవారం తిరిగి వెనక్కి పంపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు విజయవాడ - జగదల్‌పూర్ జాతీయ రహదారిపై ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే ధాన్యం పోసి నిప్పంటించి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్‌లు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రేపటిలోగా ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు బీరకాయల వెంకటేశ్వరరావు, సానికొమ్ము మల్లేషు, అచ్చెన రాము, రైతులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :