Tuesday, 28 July 2026 12:44:47 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు మండల సిపిఐ 13 వ మహాసభ, పాల్గొన్న సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు

Date : 21 June 2025 04:50 PM Views : 821

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21 తెలుగు వెలుగు )జూలూరుపాడు సీపీఐ 13 వ మండల మహాసభ పొన్నెకంటీ వెంకటేశ్వర్లు , యాస రోశయ్య, గుండె పిన్ని మధు అధ్యక్షతన మహాసభ జరిగింది మహాసభల ప్రారంభ సూచికంగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు తూముకోటయ్య ఆవిష్కరించారు . మండల 13వ మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని తెలిపారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలని అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతముందిస్తామని లక్ష్యంగా పెట్టుకునిమరి ఎన్ కౌంటర్లు చేస్తుండడం, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని కోరారు. పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి sk, షాబీర్ పాషా మాట్లాడుతూ దోపిడీ, అణచివేతకు గురవుతూ దుర్భరజీవితం గడుపుతున్న ఏజెన్సీ పల్లె ప్రజల జీవన ప్రమాణాల మార్పుకు నంది పలికి ఆధునికతవైపు నడిపించింది ఎర్ర జెండానేనని, అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమని, అన్యాయం, దోపిడీ, అణచివేతలున్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ఈ మహాసభలో సిపిఐ వైరా నియోజకవర్గ కన్వీనర్ ఎర్ర బాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండల కార్యదర్శి బోర కేశవులు, సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గం నాయకులు నేరెళ్ల రమేష్, సిపిఐ నాయకులు ఎస్కే నాగుల్ మీరా, ఎల్లంకి మధు, ఎస్కే చాంద్ పాషా, సిరిపూరపువెంకటేశ్వర్లు బెజవాడ సీతయ్య ముత్తయ్య ఉదారి నాగయ్య పొన్నగంటి వెంకటేశ్వర్లు కొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :