తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్య శాఖ తరఫున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు .ఈ యొక్క ఉపకరణాలు జూలూరుపాడు మండలానికి చెందిన కొంతమంది దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, క్లక్చర్లు మరియు బుద్ధి మాంద్యం పిల్లలకు ఎంఆర్ కిట్లు ఇంకా హియరింగ్ఎయిడ్స్ వివిధ రకాలైన పరికరాలను మన మండలానికి పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా అధికారులు మరియు జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ పాల్గొనడం జరిగినది. ఇంకా మన స్పెషల్ ఎడ్యుకేటర్లు నాగ రమేష్ మరియు సాంబశివరావు, శ్రీను పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ