తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : నెల 6వ తేదీన సాయంత్రం 3గంటలకు కొత్తగూడెం క్లబ్ నందు ప్రజాకవి,ప్రకృతి కవి, తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత జయరాజ్ మరియు అంబేద్కర్ వాదులు,సామాజిక ఉద్యమ కారులు,ప్రకృతి ప్రేమికులకు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో జరుగు సన్మాన కార్యక్రమంలో ప్రతీఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెం పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజాకవిగా, సామాజిక ఉద్యమ కారులుగా,అంబేద్కర్ వాదులుగా,ప్రకృతి ప్రేమికులుగా అదేవిధంగా మహాత్మా ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానంతో సమాజంలో ఉన్న వర్గాలన్నింటికీ,ముఖ్యంగా అట్టడుగువర్గాల వారి హక్కుల పరిరక్షణ కోసం,సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న వారికి కొత్తగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,విశిష్ట అతిథులుగా ఇల్లందు మరియు వైరా శాసన సభ్యులు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, గౌరవ అతిధి సింగరేణి సీఅండ్ఎండి బలరాం నాయక్ లు హాజరవుతారని కావున మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్ళు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, కార్మిక,కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ