తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 28(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు మంచి మనసున్న పెద్దమనిషి చారుగుండ్ల జగన్నాదం పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందుండే మంచి మనసున్న మహారాజు చారుగుండ్ల జగన్నాథం. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ , సొసైటీ చైర్మన్ చీమలపాటి భిక్షం, పాతర్లపాటి సతీష్ , పొన్నెకంటి సతీష్ .సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య , పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్, మండల నాయకులు జల్లిక రాధాకృష్ణ, పలువురు ప్రముఖులు ప్రగాడ సంతాపం వ్యక్తపరిచారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి ఆయనమృతి పట్ల గ్రామస్తులు బాదోపక్త హృదయంతో అంతిమయాత్రను కొనసాగించారు. అంతిమయాత్రలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓ బి సి సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, మండల కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు లు అతని పార్థివదేహన్ని వైకుంఠధామం వరకు మోసుకుంటూ వెళ్లారు
Admin
తెలుగు వెలుగు టీవీ