తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవి పల్లి మండలం మహాసభల సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు మరియు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు టెట్ నుండి 2010 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు తర్వాత టీఎస్ యుటిఎఫ్ లక్ష్మీదేవి పల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా లక్ష్మా ప్రధాన కార్యదర్శిగా జి నాగేశ్వరావు ఉపాధ్యక్షులుగా అనసూయ, సురేష్ కార్యదర్శులుగా కృష్ణ, పూర్ణచందర్రావు మాధవి లక్ష్మి ఆడిటర్ గా బాలు ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారిగా హాథిరాం వ్యవహరించారు. ఈ మహాసభలకు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎం రాజయ్య, జిల్లా కార్యదర్శులు పద్మారాణి ,తావూరియా జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ దాసు, సుజాతనగర్ మండల కమిటీ సభ్యులు రామదాసు ,రాజారావు శంకర్ వరలక్ష్మితదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ