Tuesday, 28 July 2026 11:17:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన - ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి

Date : 27 November 2025 05:41 PM Views : 296

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన సాధ్యమవుతుందని సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. గురువారం సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై వచ్చిన అప్పిళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గ నిర్వహించిన ఆర్టీఐ సమీక్షా సమావేశంలో సమాచార హక్కు చట్టం అమలు, పెండింగ్ కేసుల పరిశీలన, పౌర సమాచార అధికారుల పనితీరుపై ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి విస్తృతంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, వివిధ శాఖల పౌర సమాచార అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి - “సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి శక్తినిచ్చే కీలక సాధనం అని, ఈ చట్టం ద్వారా మాత్రమే ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన సాధ్యమవుతాయి అన్నారు. అవినీతిని నిర్మూలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అందువల్ల ప్రతి అధికారి చట్టంలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో పని చేయాలి అని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలకు సకాలంలో, సరైన, పూర్తి సమాచారాన్ని అందించడం అత్యవసరమని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అందించినప్పుడే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా ఆర్టీఐ కమిషన్ నియామకం లేకపోవడం వల్ల అనేక దరఖాస్తులు, అప్పీలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. పెండింగ్ కేసులన్నింటిని వేగంగా పరిష్కరించేందుకు జిల్లాల వారీగా పర్యటన చేపట్టుతున్నామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులపై పూర్తి వివరాలు సేకరించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో రికార్డుల నిర్వహణ పద్ధతిని మరింత మెరుగుపరచడం, దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆర్టీఐ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో అధికారులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పౌర సమాచార అధికారులు తమ శాఖల పరిధిలో ఉన్న కేసుల స్థితిపై వివరాలు కమిషనర్ కు వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి శాఖ తమకు వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో సమాచారం అందించాలని అన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు వివరాలతో కూడిన రిజిస్టర్ లో పొందుపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :