తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా, సుజాతనగర్ మండలం గరీబ్ పేట, రాఘవాపురం, సింగభూపాలెం, సర్వారం గ్రామ పంచాయతీ సర్పంచ్ లుగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైందని, గెలిచిన సర్పంచ్ ప్రజలందరిని కలుపుకుపోతూ ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్, కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, మాజీ ఏఎంసి చైర్మన్ రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లింగం పిచ్చిరెడ్డి,కిసాన్ కాంగ్రెస్ నాయకులు పైడా. రాజేంద్రప్రసాద్,మడిపల్లి. శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ నాయకులు అబీద్, కోటేష్,గ్రామ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ