తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సురక్షిత త్రాగునీటి వినియోగంపై ప్రజలకు అవగాహన అవసరం చదువుల్లో ముందుండాలంటే విద్యార్థుల వంద శాతం హాజరు తప్పనిసరి చండ్రుగొండ మండల పర్యటన లో జిల్లా కలెక్టర్ అంకిత్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని బెండలపాడు గ్రామం సహా పలు ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, ఆశ్రమ పాఠశాల, బస్టాండ్ పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో సీపీఓ సంజీవరావు,మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, ఎంపీవో ఖాన్, ఎంపీపీ ఖాన్, సర్పంచ్ బొర్రా లలిత కుమారి, సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, ఎంఈఓ,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ