Tuesday, 28 July 2026 03:27:04 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మార్కెట్లో దళారుల దోపిడీ అరికట్టాలి

Date : 05 December 2024 05:32 PM Views : 688

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5(తెలుగు వెలుగు)జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేయాలి మరియు మండల కేంద్రాలలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంటూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు . పత్తి, ధాన్యం అమ్ముతున్న మార్కెట్లలో దళారులు దోపిడీని అరికట్టాలని, పత్తి పంట అధికంగా పండుతున్న మండలాల్లో తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం డిమాండ్ చేశారు. గురువారం జూలూరుపాడు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పత్తి పంట చేతికొచ్చి నెలలు దాటుతున్నప్పటికీ సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయటంలో మార్కెటింగ్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అధికంగా పత్తి వండుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఉప మార్కెట్ యార్డును శాశ్వత వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొత్తగూడెం మార్కెట్ కు అనుసంధానంగా సుజాతనగర్ లో కూడా ఉప మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ శాఖ చూడాలని కోరారు. జిల్లాలో ప్రధానంగా జూలూరుపాడు సుజాతనగర్ చంద్రుగొండ టేకులపల్లి గుండాల ఆళ్లపల్లి, పాల్వంచ ములకలపల్లి దమ్మపేట, తదితర మండల కేంద్రాల్లో, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్, చర్ల వ్యవసాయ మార్కెట్,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆయన కోరారు. కేంద్ర పాలకుల కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోని నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.రైతులు పండిస్తున్న అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులు మేరకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ,2025 సంవత్సరానికి 5 .35 శాతం పెంచి వరి క్వింటాకు 2300 మద్దతు ధరలను నిర్ణయించిందని, రైతుల డిమాండ్ ప్రకారం పంటల పెట్టుబడి ఖర్చు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని ఆయన ఆరోపించారు. వరి పంట పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించారని, వాటిని తక్షణమే రైతు ఖాతాలో జమ చేయాలని ఆయన కోరారు. ఈ మావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, రాయల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :