తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వరస్తూ గుండెపోటుతో ఇటీవల మరణించిన ఏఆర్ఎస్సై ప్రకాశరావు కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో 1,00,000/- (లక్ష రూపాయల) నగదును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, జిల్లా కార్యాలయ ఏవో మంజ్యా నాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ