Tuesday, 28 July 2026 06:55:44 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న జిల్లా పోలీసులు

Date : 24 May 2025 06:05 PM Views : 1433

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 24 ( తెలుగు వెలుగు ) : వాహన తనిఖీలలో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు ఈ రోజు అనగా 24.05.2025 ఉదయం 11:30 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు X రోడ్ సమీపంలో గల A.C.A సులానగర్ మినిస్ట్రీ చర్చ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఎస్కార్ట్ గా వస్తున్న కారు నెంబర్ HR05BK6032 మరియు HR63E7315 అను నంబరు గల ఐచర్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా 698 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది.సుమారుగా 3,49,00,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. ఐచర్ వ్యానులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన,కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అట్టి రవాణాకు ఉపయోగించిన ఐచర్ మరియు కారు ను మరియు 5 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు అటవీ ప్రాంతం నుండి హర్యానా రాష్ట్రం,కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా ఇట్టి గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది.పట్టుబడిన నిందితులందరూ కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున ఇట్టి గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

పట్టుబడిన ఆరుగురు వ్యక్తుల వివరాలు A1). సందీప్ కుమార్ @ రింకు S/o.బల్వీర్ సింగ్, 35 yrs, కశ్యప్, Driver R/o.జెగ్నకేర,కురుక్క్షేత్ర జిల్లా,హర్యానా రాష్ట్రం. A2). లక్విందర్ S/o పప్పు, 21 yrs, చిర్నర్ (హరిజన్), వృతి : ఐచెర్ క్లీనర్, R/o సప్లి గాడి (v), కౌతాన్ జిల్లా , హర్యానా రాష్ట్రం. A3).అమర్ నాధ్ కుమార్ @ అమర్ నాధ్ S/o సంశేరు సింగ్,26 yrs,వృత్తి: ఎలక్ట్రీషియన్ R/o.కురుక్షేత్ర జిల్లా,హర్యానా రాష్ట్రం. A4).పవన్ కుమార్ S/o అశోక్ కుమార్, 34 yrs, శర్మ, వృతి: Car Driver R/o పానిపట్ జిల్లా, హర్యానా రాష్ట్రం. A5).రాజ్ కుమార్ @ వినోద్ S/o దిల్ రామ్, 33 yrs,రాడ్ బెండింగ్ వర్కర్,R/o.జోగ్నకేర,కురుక్క్షేత్ర జిల్లా, హర్యానా రాష్ట్రం. A6). కృషన్ కుమార్ @ కాలే S/o.జిలే సింగ్, 35 yrs,వృత్తి: Car Driver R/o.గోహన,సోనిపత్ జిల్లా, హర్యానా రాష్ట్రం. అమ్మిన వ్యక్తి వివరాలు: A7) హరి ఖారా A8) ప్రిన్స్ కుమార్ R/o హర్యానా రాష్ట్రం ( Receiver). ఈ రోజు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగినది.నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టేకులపల్లి సిఐ టి.సురేష్,ఎస్సై A.రాజేందర్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు సిబ్బందిని ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :